గుడి మల్కాపూర్ కార్పొరేటర్, బీజేపీ నేత దేవర కరుణాకర్ అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వారి కుటుంబీకులు బంజారాహిల్స్ లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే ఆయన కన్నుమూశారు. దీంతో కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండేండ్ల క్రితం కరుణాకర్‌ కూతురు భవాని కరోనా మృతిచెందారు. దీంతో దేవర కరుణాకర్ ను చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ నేతలు హాస్పిటల్ వద్ద క్యూ కట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి దేవర కరుణాకర్ మూడు సార్లు కార్పొరేటర్ గా గెలుపొందారు.