తమిళనాడులో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఓ రోజు ముందే వారిసు సినిమా షో వేశారు. సినిమా బాగుందని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని దిల్ రాజు తెలిపారు. తమిళనాడులో హిట్ కొట్టి, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ నెల 11న వారిసు తమిళనాడులో రిలీజ్ అయ్యింది. ప్రేక్షకాదరణ కూడా పొందుతోంది. అయితే… ఈ నెల 14 వారసుడు పేరుతో మన తెలుగులో రిలీజ్ అవబోతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమా పాయింట్ చెప్పినప్పుడే బాగా నచ్చింది. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. అని తెలిపారు. తాను, వంశీ తమిళంలోకి వెళ్లి, ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇక్కడికి వచ్చామని, ఇది సాధారణ విషయం కాదన్నారు. అందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు ప్రకటించారు. సక్సెస్ అంటే డబ్బు మాత్రమే కాదని, దానితో వచ్చే ఎమోషన్ ముఖ్యమన్నారు. బొమ్మరిల్లు సినిమా చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయని, వంశీ తనకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇచ్చారన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘కుటుంబ విలువలు తెలియజేసే సినిమా ఇది. ఈ కథను విజయ్‌తో చేస్తున్నామని దిల్ రాజు గారు చెప్పగానే టెన్షన్ మొదలైంది. కానీ సినిమా విడుదలై థియేటర్‌లో ప్రేక్షకులు క్లాప్స్ కొడుతుంటే మంచి సినిమా తీశామనే ఫీలింగ్ కలిగింది. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, థమన్ కూడా పాల్గొన్నారు.












