శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మూడు ముక్కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది మూడు ముక్కల ప్రభుత్వమని, ఆయన మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం వుందన్నారు. మూడు ముక్కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేను మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్నాను. పంచలు ఊడదీసి కొడతాను అన్న వాడిని. ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్న అని గుర్తు చేసుకున్నారు. సరైన రాజు గనక లేకపోతే సగం రాజ్యం నాశనమవుతుందని, సలహాలిచ్చేవాడు సజ్జల అయితే.. పూర్తిగా నాశనమవుతుందని తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు.

సినిమాలు చేస్తున్నా… తన మనస్సు మాత్రం కష్టాల్లో వున్న ప్రజల గురించే ఆలోచిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను సగటు మధ్యతరగతి మనిషినని, సామాన్యుడినని అభివర్ణించుకున్నారు. తన కోసం తొలిప్రేమ, ఖుషి సినిమాల వరకే పోరాటం చేశానని, సినిమాల విజయం ద్వారా తనకు ఆనందం కలగలేదన్నారు. సామాన్యుల కష్టం తనను ఆనందంగా వుండనివ్వలేదని వివరించారు. ఈ రోజు ప్రతి సన్నాసితో తిట్లు పడుతున్నా… బాధ కలగడం లేదని, సాటి మనుషుల కోసం జీవించడం గొప్ప విషయంగా భావిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.












