హిడ్మా మరణించలేదంటూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల

తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో తమ అగ్రనేత హిడ్మా చనిపోలేదని మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ లేఖను రిలీజ్ చేసింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కమాండర్ హిడ్మా చనిపోయాడన్న పోలీసు ప్రకటనలో ఏమాత్రం నిజం లేదని ప్రకటించింది. బుధవారం తెలంగాణ- ఛత్తీస్ గఢ్ అడవుల్లో సీఆర్పీఎఫ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించారు. ఇందులో హిడ్మా కూడా వున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అగ్రనేత హిడ్మా కోసం పోలీసులు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

హిడ్మా స్థానిక ఆదివాసి తెగకు చెందిన వ్యక్తి కావడంతో గ్రామస్థుల మద్దతు కూడా లభిస్తోంది. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. చత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి హిడ్మా స్వగ్రామం. ఇతనికి సంతోష్, హిద్మల్లు వంటి మారు పేర్లు ఉన్నాయి. ఉద్యమంలోకి రాక ముందు హిడ్మా వ్యవసాయం చేసేవాడు. 7వ తరగతి వరకే చదువుకున్న హిడ్మా.. మావోయిస్టు పార్టీతో పని చేసిన ఓ లెక్చరర్ ద్వార ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఆయుధాల తయారీ, రిపైర్ వర్క్‌లో నిపుణుడిగా మారాడు

Related Posts

Latest News Updates