నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు… ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ లభించింది. తన స్వీయ రక్షణ కోసం గన్ లైసెన్స్ కావాలని నుపుర్ శర్మ ఢిల్లీ పోలీసులను అభ్యర్థించడంతో ఢిల్లీ పోలీసులు ఆమెకు లైసెన్స్ ఇచ్చారు. జ్ఞానవాపి కేసు విచారణ సమయంలో నూపుర్ శర్మ గత ఏడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేగింది. దీంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది.

అనంతరం ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే… ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. హత మారుస్తామంటూ బెదిరింపులకు దిగారు. అలాగే ఆమెపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఆమెపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నిటినీ ఢిల్లీలోనే విచారణ జరిగేలా గత ఏడాది ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది.

Related Posts

Latest News Updates