తనకు పుట్టబోయే బిడ్డ గురించి రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని భావోద్వేగ పోస్ట్ చేశారు. అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు సాంగ్ కు అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ , రాంచరణ్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆర్ఆర్ఆర్ టీంలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ జర్నీలో తాను భాగమయ్యేలా చేసిన రాజమౌళి, చరణ్ లకు ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు తన బిడ్డ కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు.












