వలస పాలన వెళ్లిపోయింది… కానీ.. ఆ మూలాల చరిత్రే వుంది : అమిత్ షా

మన దేశ చరిత్రను బానిసత్వం నుంచి విముక్తం చేయడమన్న పనిలో రచయితలు నిమగ్నమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ పని ఇప్పటికే ప్రారంభమైందని, దీనిని దేశ ప్రజలు స్వాగతించాలని పిలుపునిచ్చారు. వాస్తవికత ఆధారంగా చరిత్రల రాయాలని సూచించారు. సంజీవ్ సన్యాల్ రచించిన ”రివల్యూషనరీస్ ది అదర్ స్టోరీ ఆఫ్ హౌ ఇండియా వాన్ ఇట్స్ ఫ్రీడమ్” అన్న పుస్తకావిష్కరణలో అమిత్ షా ప్రసంగించారు. ఆంగ్లేయులు భారత్ ను విడిచి వెళ్లింది వాస్తవమే కానీ… వారి కోణంలోనే ఆవిష్కరించిన చరిత్ర ఇంకా వుండిపోయిందన్నారు. 1857 ఉద్యమంలో సాయుధ పోరాటాలు, అహింస అనే రెండు పద్ధతులూ ప్రముఖ పాత్ర పోషించాయని, దేనికదే ప్రముఖ పాత్ర పోషించాయన్నారు. ఇప్పటి తరానికి సరైన చరిత్రను చెప్పాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.

రైతులు, సాహితీవేత్తలు దేశవ్యాప్తంగా వున్న అన్ని సమూహాలూ దేశాన్ని విముక్తం చేయడంలో గొప్ప కృషి చేశారని, వేర్వేరుగా పోరాటం చేసినా… వారందరి లక్ష్యమొక్కటే అని వివరించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధడు నేతాజీకి ఎంత ఖ్యాతి దక్కాలో అంత దక్కలేదని, అలాగే ఐఎన్ఏ కి కూడా ఎంత పేరు ప్రఖ్యాతులు రావాలో అంత రాలేదన్నారు. తరతరాల వారిని దేశభక్తులుగా మార్చిన ఘనత ఆయనదని, ఇప్పటికీ తేజోపుంజంగా వెలుగుతూనే వున్నారన్నారు. కర్తవ్య పథ్ మార్గంలో నేతాజీ విగ్రహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు. గతంలో చరిత్రను వక్రీకరించి రాసి వుండొచ్చని, కానీ… ఇప్పటి చరిత్రకారులు మాత్రం వాస్తవ, ఉజ్వల చరిత్రకు దగ్గరగా రచనలు చేయాలని సూచించారు.

Related Posts

Latest News Updates