ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగపేట మండలం రాజుపేట సమీపంలో తెల్లవారు ఝామున లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళా ప్రయాణికురాలు మరణించగా… మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు… మంగపేట మండలం దగ్గర ఇసుక లారీని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగగానే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.