తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సీఎస్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన శాంతి కుమారికి పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి భవన్ నుంచి బీఆర్కే భవన్‌కు చేరుకున్న శాంతి కుమారికి సీఎస్ ఓఎస్డీ విద్యాసాగర్ స్వాగతం పలికారు. సీఎస్ గా ప్రకటించిన కొద్ది గంటల్లోనే శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి 2025, ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శాంతి కుమారి.. గతంలో సీఎం కార్యాలయంలో పని చేశారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి 2025, ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శాంతి కుమారి.. గతంలో సీఎం కార్యాలయంలో పని చేశారు. తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతి కుమారి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను నిర్వర్తించారు.