‘ఆర్ఆర్ఆర్’ సంచలనం సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గోల్డ్ అవార్డును ట్రిపుల్‌ఆర్ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కీరవాణి అండ్ టీమ్ కి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్వర మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ కూడా దీనిపై స్పందించాడు. ”ఆర్ఆర్ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ఇదొక అద్భుతమైన మార్పు అని, భారతీయులందరూ ముఖ్యంగా మీ అభిమానుల తరపున కీరవాణి, రాజమౌళి యూనిట్ కి అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. కీరవాణి స్వర పరిచిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ ఆలపించిగా.. చంద్రబోస్ సాహిత్యం అందించాడు. ప్రేమ్ రక్షిత్ నృత్యాలు సమకూర్చాడు.
https://twitter.com/arrahman/status/1612993411673624577?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612993411673624577%7Ctwgr%5Ec38cde67ffb3cf05fee07ba7d567b6501b640229%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fa-r-rehman-congratulates-rrr-team-923016












