తిరుపతిలో జియో 5జీ సేవలు ప్రారంభం.. యేడాది నాటికి ఏపీ మొత్తానికి అందుబాటులోకి

రిలయన్స్‌ జియో ట్రూ 5జీ సేవలు తిరుపతి నగరంలో ప్రారంభమయ్యాయి. తొలిదశలో తిరుమల సహా, విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ సేవలు ప్రవేశపెట్టిన రిలయన్స్‌ జియో కంపెనీ తాజాగా తిరుపతిలో కూడా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ తిరుపతికి వున్న ప్రాధాన్యత దృష్ట్యా జియో తన అధునాతన సేవలను తిరుపతికి విస్తరింపజేసింది. ఈ సందర్భంగా కంపెనీ ఏపీ సీఈవో మందపల్లి మహేశ్ మాట్లాడుతూ 1 జీబీఎఎస్‌+ వేగంతో అపరిమిత 5జీ డేటా వినియోగానికి తమ కంపెనీ వెల్‌కమ్‌ ఆఫర్‌ ఇస్తోందన్నారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరింపజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెట్వర్క్ కోసం జియో ఇప్ప‌టికే రూ. 26,000 కోట్లతోపాటు అదనంగా 5జీనెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి మరో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం గ్రామాలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

Related Posts

Latest News Updates