గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో హైదరాబాదీ గుజరాతీ అసోసియేషన్ అధ్యక్షుడు జిగ్నేశ్ దోషి గుజరాత్ లో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి జిగ్నేశ్ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం భూపేంద్ర పటేల్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకి శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలియజేశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ సాధించడం, ఆ తర్వాత సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో జిగ్నేశ్ దోషి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గుజరాతీ సంక్షేమ సంఘం చేస్తున్న కార్యక్రమాలు, పనులను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కి వివరించారు.