బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ మరో విశిష్ఠమైన పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సొంతం చేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఈ పురస్కారం లభించింది. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నాటు నాటు పాటకు వరించిన పురస్కారాన్ని కీరవాణి అందుకున్నారు. దాంతో పాటు ఇక ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా ట్రిపుల్ ఆర్ సినిమా నామినేట్ అయింది.

ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా వుందన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన హెచ్ఎఫ్పీఏ కు ధన్యవాదాలు ప్రకటించారు. నాటు నాటు పాటలో భాగస్వామిగా వున్న రాహుల్ సిప్లిగంజ్ కు ధన్యవాదాలు ప్రకటించారు. ఈ సందర్భంగా తన సోదరుడు రాజమౌళికి కీరవాణి ధన్యవాదాలు ప్రకటించారు.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) January 11, 2023













