తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కొనసాగింపును తెలంగాణా హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. అయితే… దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కొనసాగింపును తెలంగాణా హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ కేడర్ కేటాయింపు వివాదంపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కేడర్ కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.అయితే… కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఆపేసి… సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీంతో సీఎస్ గా సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు. అయితే.. 2017 లో క్యాట్ ఉత్తర్వులను కొట్టేయాలంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ క్యాట్ ఉత్తర్వులను కొట్టేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది.