బీఆర్ఎస్ ఎంపీ సంతోశ్ కుమార్ తో కిలిమంజారో పర్వత అధిరోహణ చేయనున్న గిరిజన విద్యార్థి బానోత్ వెన్నెల కలుసుకుంది. ఈ నెల 19 నుంచి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వత అధిరోహణను బానోత్ వెన్నెల చేయనుంది. ఈ సందర్బంగానే ఆమె ఎంపీ సంతోశ్ ను కలుసుకుంది. ఈ సందర్భంగా వెన్నెలను సంతోశ్ అభినందించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వెన్నెల పట్టుదలతో ఈ కార్యక్రమం చేస్తోందని, తన వంతుగా ఆమెకు 3 లక్షల ఆర్థిక సాయాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులోనూ అండగా వుంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ… తమది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలమని, గిరిజన కుటుంబం అని పేర్కొంది. తనకు చిన్నతనం నుంచే పర్వతారోహణ చేయడం ఇష్టమని తెలిపింది. భవిష్యత్తులో మౌంట్ ఎవరెస్ట్ ను కూడా అధిరోహిస్తానని తెలిపింది.