కృష్ణా జిల్లా రాజకీయంలో ఆశ్చర్యకర పరిణామం జరిగింది. టీడీపీ ఎంపీ కేశినేని నానితో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే తండ్రి వసంత నాగేశ్వర రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించుకున్నారు. అయితే.. వీరిద్దరి భేటీ చాలా మర్యాద పూర్వక భేటీయేనని పార్టీ పేర్కొంది. కేశినేని నాని తాతయ్య కేశినేని వెంకయ్యతో వసంత నాగేశ్వర రావుతో సన్నిహిత సంబంధాలు వుండేవని, అందుకేతో కేశినేనితో భేటీ అయినట్లు కొందరు పేర్కొంటున్నారు.
మాజీ హోం శాఖా మాత్యులు గౌ. శ్రీ వసంత నాగేశ్వరరావు గారు ఎంపి శ్రీ @kesineni_nani గారిని కలిసి అనేక సామాజిక, రాజకీయ అంశాలను చర్చించి, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, నిబద్ధత, నిజాయతీ కల నాయకునిగా ప్రజల మన్ననలు పొందిన తీరును ప్రశంసించారు. pic.twitter.com/CAk5n0PtT5
— Kesineni Bhavan (@KesineniBhavan) January 10, 2023












