ఆస్కార్ పురస్కారం కోసం నామినేషన్ బరిలో నిలిచిన సినిమాలను ఆస్కార్ వెల్లడించింది. ఆస్కార్ లో మన దేశం నుంచి 10 సినిమాలు బరిలో నిలిచాయి. ది ఛల్లో షో, ఆర్ఆర్ఆర్, కశ్మీరీ ఫైల్స్, కాంతారా, విక్రాంత్ రోణ, గంగూభాయి కతియావాడి, మి వసంత రావ్, తుజ్యా సాథీ కహీ హై, రాకెట్రీ, ఇరవిన్ నిళల్ చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా 301 సినిమాలు పోటీలో నిలిచాయి. ఇదిలా ఉండగా 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన చిత్రాల జాబితాను 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది.
గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన కాంతార.. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది. కాగా ఈ సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించినట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెలిపింది.మరో కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణ’ కూడా ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చెబుతూ ఆ చిత్ర బృందం కూడా ట్వీట్ చేసింది.












