కోవిడ్ 19 తో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం నిధులను విడుల చేసింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు 10 కోట్లను విడుదల చేసింది. ఏపీ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కుటుంబానికి 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించేదుకు జిల్లాల వారీగా ప్రభుత్వం 10 కోట్లను విడుదల చేసింది. అయితే… పరిహారం చెల్లించిన తర్వాత ఆ మొత్తం వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్లకు సూచించింది.












