మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన వార్తలేర్ వీరయ్య ప్రీరిలీజ్ ఫంక్షన్ విశాఖలో అంగరంగ వైభోగంగా జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అయితే హీరోయిన్ శృతిహాసన్ ఫంక్షన్ కు అటెండ్ కాలేదు. అయితే తనకు జ్వరం వచ్చిందని..కొవిడ్ టెస్టు కూడా చేయించుకున్నానని నిన్నశృతిహాసన్ సోషల్ మీడయాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. నేను కథ వినగానే ఫస్ట్ సిట్టింగ్ లో ఒప్పుకున్న చిత్రాలన్నీ ఘన విజయాలు సాధించాయి. ఈ సినిమాకూ దర్శకుడు బాబీ కథ చెప్పగానే మనం సినిమా చేద్దామని చెప్పాను. ’వాల్తేరు వీరయ్య’ నిఖార్సయిన కమర్షియల్ సినిమా. ఈ చిత్ర విజయం ఖాయమని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.

రవితేజ ఈ కథలోకి రాగానే ఎనర్జీ రెట్టింపు అవుతుందన్నారు. దర్శకుడు బాబీ నా అభిమాని..అయితే ఈ చిత్ర రూపకల్పనలో అతని అంకితభావం చూశాక నేను అతనికి అభిమానిని అయ్యాను అని ప్రకటించారు. నా కెరీర్ లో ఎంతోమంది గొప్ప నిర్మాతలను చూశాను. సినిమా పట్ల అంతే ప్యాషన్ ఉన్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అని చెప్పగలను అని అన్నారు. ఇక… దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఈఅ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని మెగాస్టార్ అన్నారు.












