పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత కేషరీనాథ్ త్రిపాఠి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. త్రిపాఠి శ్వాస సంబంధిత, చేయి విరగడంతో గత డిసెంబర్ నుంచి స్థానిక ప్రవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంతో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. గతంలో ఆయన రెండుసార్లు కరోనా బారినపడ్డారు. చాలాకాలంపాటు లక్నోలోని సంజయ్ గాధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకు న్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.












