హాలీవుడ్ నటి జమీలా జమీల్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను బండబూతులు తిట్టింది. రిషి సునాక్ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సామూహికంగా సమ్మె చేయకుండా అడ్డుకుంటున్నాడని, సమ్మెలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నాడని జమీలా మండిపడింది. దేశంలో ప్రజలకు సమ్మె చేసే స్వేచ్ఛ లేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు కా? అంటూ రాయలేని పదజాలాన్ని ఉపయోగించింది. రిషి సునాక్‌ది నాయకత్వం కాదని, నియంతృత్వం అని ఆగ్రహం వ్యక్తంచేసింది. బతకడానికి సరిపడా వేతనాలు లేని వాళ్లు సమ్మెకు దిగారని, కానీ ఈ సంపన్న నియంత (బ్రిటన్ ప్రధాని) వారిని అణిచివేస్తున్నాడని జమీలా విమర్శించింది.












