శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట…సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలొస్తున్నాయి. తెలంగాణకు చెందిన అమ్మాయితో శర్వానంద్ ఏడడుగులు వేయబోతున్నాడని టాక్. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ అమ్మాయి యూఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుందట. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంతో ఇటీవలే హైదరాబాద్‌కు తిరిగొచ్చిందని అంటున్నారు.

ప్రేమించిన అమ్మాయిని గురించి ఇంట్లో చెప్పి మ‌న హీరో పెళ్లికి లైన్ క్లియ‌ర్ చేసుకున్నార‌ని, ఇది ల‌వ్ క‌మ్ అరెంజ్డ్ మ్యారేజ్ అని గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే త‌న పెళ్లి గురించి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన వివ‌రాల‌ను శ‌ర్వానంద్ తెలియ‌జేస్తార‌నే వార్త‌లు కూడా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్రతి ఇంటర్యూలోనూ శర్వానంద్ ను పెళ్లి గురించే అందరూ అడుగుతుంటారు. ఒకవేళ.. ఈ పెళ్లి వార్తే నిజమైతే.. ఇకపై శర్వాను ఎవ్వరూ పెళ్లి గురించి అడగరు. శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ జనవరి 26న జరుగనున్నట్లు తెలుస్తుంది. సమ్మర్‌లో పెళ్లిని ప్లాన్‌ చేస్తున్నారట.

Related Posts

Latest News Updates