ప్రధాని మోదీతో భేటీ అయిన మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈవో సత్య నాదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల తన భారత పర్యటనలో భాగంగా ఆయన మోదీతో సమావేశమై, డిజిటల్ ఇండియాతో పాటు పలు అంశాలపై చర్చించారు. డిజిటల్ ఇండియాకి తమ కంపెనీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సత్య నాదేళ్ల మోదీకి హామీ ఇచ్చారు. ఈ సమావేశం ఎంతో ఆలోచనాత్మక ధోరణితో సాగిందని పేర్కొంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్‌ ఇండియా విషయంలో ప్రపంచానికి ఒక దివిటీలా దారి చూపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ట్వీట్‌ చేశారు.ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ విషయంలో భారత్‌ గొప్పగా సహకరిస్తుందని చెప్పారు.

Related Posts

Latest News Updates