మధ్యప్రదేశ్ లో కుప్ప కూలిన శిక్షణా విమానం… పైలట్ దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌ మరణించగా మరొకరు తీవ్రంగా గాపడ్డారు. శుక్రవారం ఉదయం ప్రైవేటు శిక్షణ విమానం.. రేవా జిల్లాలోని ఉమ్రి గ్రామంలో ఉన్న ఓ ఆలయ శిఖరానికి ఢీకొట్టి కుప్పకూలింది. దీంతో విమానం నడుపుతున్న పైలట్‌ అక్కడికక్కడే మృతిచెందగా, ట్రైనర్‌ తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాల నుంచి వారిని వెలికితీశారు.

Related Posts

Latest News Updates