అంతర్జాతీయ అవార్డును అందుకున్న మన జక్కన్న…

అంతర్జాతీయంగా గుర్తింపు వున్న న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జక్కన్న కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా జక్కన్న ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తనకి ఎప్పుడూ సహకరించే కుటుంబీకులకు జక్కన్న ధన్యవాదాలు ప్రకటించారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ… అవార్డ్ తీసుకున్నందుకు ఎంత ఆనందంగా ఉందో స్టేజ్ మీదనుంచి మీ అందరిని చూస్తుంటే అంతే కంగారుగా ఉందన్నాడు. నేను సినిమాని ఒక గుడిలా భావిస్తానని, చిన్నతనంలో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు ఒకరకమైన ఆనందం కలుగుతుందని వివరించాడు. అంతే ఆనందాన్ని తన సినిమా చూస్తున్నవాళ్లందరు పొందాలని అనుకుంటానని అన్నాడు. భారతదేశంలో సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తారో, న్యూయార్క్, చైనా లాంటి దేశాల్లోని ప్రజలు కూడా అంతే ఎంజాయ్ చేశారని, సినిమాని ఇంతటి స్థాయికి తీసుకెళ్లిన ఎన్ టీఆర్, రామ్ చరణ్ కి ధన్యవాదాలు ప్రకటించారు. ఈ అవార్డు ఫంక్షన్ కి రాజమౌళి పూర్తి భారతీయ సంప్రదాయ దుస్తులతో హాజరయ్యారు.

Related Posts

Latest News Updates