ప్రతి భారతీయుడూ గర్వించదగ్గది.. కెప్టెన్ శివ చౌహాన్ పై మోదీ ట్వీట్

సియాచిన్‌లో తొలి మహిళా సైనికాధికారిగా నియమితులైన కెప్టెన్ శివ చౌహాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ విషయమని, ఇది భారతదేశ నారీ శక్తి స్ఫూర్తి అని మోదీ ట్వీట్ చేశారు. సియాచిన్ లో గడ్డకట్టించే చలి… సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తు… అడుగడుగునా ప్రమాదమే వుంటుంది. అయినా… అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ రక్షణ కోసం శివ చౌహాన్ ముందడుగు వేశారు. సియాచిన్ లో పోస్టింగ్ సాధించిన తొలి మహిళా సైనికాధికారిగా రికార్డుల్లోకెక్కారు.

దీనికంటే ముందు కొన్ని నెలల పాటు సియాచిన్ బ్యాటిల్ స్కూల్లో ఆమె శిక్షణ పొందారు.కఠోర శిక్షణ అనంతరం కుమార్ పోస్ట్ వద్ద శివ చౌహాన్ ను నియమించినట్టు ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. కెప్టెన్ శివ చౌహాన్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 11 ఏళ్ల వయసులో తండ్రి మరణించగా, తల్లి కుటుంబ బాధ్యతలు చేపట్టి, శివ చౌహాన్ని చదివించింది. భారత సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవలు అందించాలన్న అభిలాషతో ఆమె సైన్యంలో ప్రవేశం పొందారు.

Related Posts

Latest News Updates