”ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023” రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం

విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో నిర్వహించనున్న ”ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023” (జీఐఎస్‌) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీఐఎస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరనాథ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కీలకమైన 12 రంగాల్లో దేశీయ, విదేశీ పెట్టబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేవిధంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ఈ సమ్మిట్ కు బాగా ప్రచారం కల్పించేందుకు ప్రకటనలు బాగా ఇస్తామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. దస్సులకు ఈవెంట్ పార్టనర్ గా సీఐఐ, నాలెడ్జ్ పార్టనర్ గా కేపీఎంజీ వ్యవహరించనున్నాయని, వీటి ప్రచారానికి ఈవెంట్ మేనేజర్ ఏజెన్సీ కోసం టెండర్లను పిలిచామని మంత్రి తెలిపారు.

Related Posts

Latest News Updates