యూట్యూబ్ ను షేక్ చేసేస్తున్న ”వారసుడు” విజయ్ ట్రైలర్

తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వస్తోంది. తెలుగులో వారసుడు పేరుతో వస్తోంది. చిత్రం తెలుగు ట్రైలర్ ను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన కాసేపటికే యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్, పరమ్ పొట్లూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సంగీత కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి.ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది. ట్రైలర్ విడుదలైన గంటలోనే 50 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ దూసుకుపోతుంది. ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు,తమిళ భాషల్లో విడుదల కానుంది. ఎస్‌ తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

Related Posts

Latest News Updates