భర్త పార్టీ మారితే.. నేనూ మారిపోతా.. కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత

ఏపీ మాజీ హోంమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రాజకీయంగా తమ మనుగడ వైసీపీతోనేనని ప్రకటించారు. అయితే.. తన భర్త దయాసాగర్ పార్టీ మారతాను.. నువ్వు కూడా నాతో వచ్చేయ్ అంటే… భర్తతోనే వెళ్తాను. ఎంత రాజకీయనాయకురాలినైనా… ఓ భార్యగా నేను భర్త అడుగుజాడల్లోనే నడుస్తాను. దయాసాగర్ ఓ పార్టీలో, సుచరిత ఇంకో పార్టీలో వుండరు. అంటూ మేకతోటి సుచరిత గుంటూరు సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీతో మనగలిగినన్ని రోజులు వుండాలని అనుకుంటున్నామని, తాము వైసీపీ కుటుంబీకులమేనని అన్నారు. ఎంత విభేదాలున్నా… కుటుంబంలో సహజమేనంటూ మెలికపెడుతూ మాట్లాడారు.

Related Posts

Latest News Updates