అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ పునర్నవి స్యాడ్ పోస్ట్

పునర్నవి భూపాలం.. అటు సినిమాలో, ఇటు బిగ్ బాస్ లో దుమ్ము దులిపేసింది. రెండింటిలోనూ యమ యాక్టివ్ గా వుంటూ ప్రేక్షకులను తెగ ఆకట్టేసుకుంది. బిగ్ బాస్ షోతో అయితే.. పునర్నవి రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అయితే… ఈ మధ్య పునర్నవి పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. లండన్ లో సైకాలజీ చేస్తోంది. అందుకే పూర్తిగా దానిపైనే శ్రద్ధ పెట్టింది. అయితే…. ఈ మధ్య ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ విషయాన్ని పునర్నవే స్వయంగా వెల్లడించింది. ఇన్ స్టాగ్రమ్ స్టోరీ పోస్ట్ షేర్ చేసింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నానంటూ పోస్ట్ చేసింది. కొత్త సంవత్సరం ఊపిరితిత్తుల సమస్యతోనే ప్రారంభమైంది. చాలా రోజులైంది. ఇన్ని రోజులు అనారోగ్యంతో బాధపడటం ఇదే మొదటి సారి. ఇదే చివరి సారి కావాలని కూడా ఆశిస్తున్నా. ఇంకా ఊపిరితిత్తుల సమస్య తగ్గలేదు. అనారోగ్యంతోనే వున్నా అంటూ పోస్ట్ చేసింది.

Related Posts

Latest News Updates