ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో మంగళవారం చేరారు. రొటీన్ చెకప్‌ల కోసం ఆసుపత్రిలో చేరినట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. సోనియాకు కరోనా బారిన పడిన తరువాత కొన్ని రోజులు సర్ గంగారామ్ ఆసుపత్రిలోనే ఉన్నారు. అప్పటినుంచి ఆమె రెగ్యూలర్ చెకప్ చేయించుకుంటున్నారు. సోనియాతో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఈ రోజు రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆమె పాల్గోనలేదు. కొద్ది నెలల క్రితమే ఆమె వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. ఇటీవల కర్ణాటక, ఢిల్లీలో భారత్ జోడో యాత్ర ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీతో కలిసి కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates