నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ పరిస్థితులు మారుతున్నాయి. మెల్లిమెల్లిగా.. పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఉగ్రవాదం వైపు యువకులు తక్కువగా మొగ్గుతూ.. ఉపాధి వేటలో బిజీ బిజీ అయ్యారు. గతంలో తమ తమ పిల్లలు ఉగ్రవాదం వైపు మళ్లుతుంటే.. తల్లిదండ్రులు చూసీ చూడనట్లు వుండేవారు. కానీ.. ఈ మధ్య అలా యువకులు అటు వైపు వెళ్లితే.. తల్లి తండ్రులే నచ్చ చెప్పి, వారిని వెనక్కి పిలిచేస్తున్నారు. ఇక.. సినిమా రంగం కూడా డెవలప్ అవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రారంభం కూడా జరిగిపోయింది.

ఇకపై జమ్మూ కశ్మీర్ టెర్రరిస్ట్ హాట్ స్పాట్ కాదు… టూరిస్ట్ హాట్ స్పాట్ గా మారిపోయింది. నిజమే.. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2022 లో 22 లక్షల మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్ ను సందర్శించారని కేంద్ర హోంశాఖ లెక్కలు విడుదల చేసింది. గతంతో పోలిస్తే ఇది 4 రేట్లు అధికమని కూడా చెప్పింది. ఇక.. అక్కడ ఉగ్రవాద సంఘటనలు 2018 లో 417 జరిగితే.. 2021 నాటికి 229 కి పడిపోయాయి. ఇక.. జవాన్ల మరణాలు కూడా తగ్గాయని, 2018 లో 91గా వుంటే.. 2021 నాటికి 42 కి తగ్గాయని తెలిపింది. ఇప్పుడు రాళ్లు రువ్వే సంఘటనలు కూడా లేవని, ఇస్లామిక్ ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్ కూడా 22 శాతానికి తగ్గిపోయిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇక.. ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద, జలవిద్యుత్ విద్యుత్‌లో ₹ 80,000 కోట్ల వ్యయంతో సుమారు 63 ప్రాజెక్టులు నిర్మించామని, 4,287 కోట్లతో మరికొన్ని ప్రాజెక్టులు పురోగతిలో వున్నాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది.












