బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టోల్ ప్లాజా సిబ్బందిపై వీరంగం సృష్టించారు. తన వాహనాలను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తన కారుకు రూట్ క్లియర్ చేయలేదని మండిపడుతూ.. నానా వీరంగం చేశారు. టోల్ ప్లాజా సిబ్బందిని బూతులు తిడుతూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెలరేగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

అయితే.. ఎమ్మెల్యే అనుచరుల వాదన మరోలా వుంది. కావాలనే టోల్ ప్లాజా సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారని, కావాలనే ఎమ్మెల్యే కారును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే.. గతంలోనూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్ చల్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి పోస్టులు పెడితే.. సీరియస్ గా వుంటుందని దుర్గం చిన్నయ్య హెచ్చరించారు.