సినీ అభిమానులు, పాఠకుల ముందుకి వస్తున్న “తెలుగు సినిమా పాత్రికేయ చరిత్ర”

తెలుగు జర్నలిజంలో పాత్రికేయుల గురించి, సంపాదకుల గురించి, తెలుగు పాత్రికేయత గురించి చెప్పమంటే ఠక్కున కావాల్సినంత సమాచారం వచ్చేస్తోంది. ఈ మధ్య సమాచారం మరింత పెరిగిపోయింది. అయితే.. తెలుగు పాత్రికేయ రంగంలో సినిమా పాత్రికేయత గురించి, పాత్రికేయుల గురించిన సమాచారం అంతగా ప్రాచుర్యంలో లేదు. వున్నా… ఒక్క చోట పోగు చేసి లేదు. ఇప్పుడు ఈ లోటును తెలుగు సినిమా పాత్రికేయులు వినాయకరావు లోటును తీర్చారు. తెలుగు సినిమా పాత్రికేయ చరిత్ర పేరుతో ఓ పుస్తకం రాశారు. ఎన్నో అడ్డంకులు, అవరోధాలను అధిగమించి, రచయిత ఈ పుస్తకాన్ని తెస్తున్నారు. తెలుగు సినిమా జర్నలిజం యాత్ర, దాని విశేషంగా పనిచేసి వారి పూర్తి సమాచారంతో కూడిన ఒక్క పుస్తకం కూడా ఇప్పటి వరకు రాలేదన్న బాధతోనే ఈ పుస్తకం రాశానని రచయిత ప్రకటించారు. ఇలా పాత్రికేయ జర్నలిస్టులందరి సమాచారం, తెలుగు పాత్రికేయత చరిత్రను ఒక్క చోట పోగు చేసి, పుస్తకం తేవడం ఇండియాలో ఇదే ప్రథమ ప్రయత్నం. ఇంతటి విశేష కృషి చేసిన రచయిత వినాయకరావు అభినందనీయులు.

Related Posts

Latest News Updates