జమ్మూ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీలో హిందువులే టార్గెట్ గా ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నలుగురు హిందూ పౌరులు మరణించారు. ముందుగా హిందువులను గుర్తించడానికి ఇస్లామిక్ ఉగ్రవాదులు వారి వారి ఆధార్ కార్డులను ఉపయోగించి మరీ…. కాల్పులకు తెగబడ్డారని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. ఇలా ఆధార్ కార్డులను ఉపయోగించి మరీ… కాల్పులు చేయడం ఇదే ప్రథమం. ఇక… ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా.. 10 మంది హిందువులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలించాయి.

కేవలం ఇద్దరు ఇస్లామిక్ ఉగ్రవాదులే ఈ ఘాతుకంలో పాల్గొన్నారని తెలుస్తోంది. మరో వైపు ఇస్లామిక్ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు రాజౌరీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయని అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ ప్రకటించారు. ఈ కాల్పుల్లో సతీశ్ కుమార్, దీపక్, ప్రీతమ్ లాల్, శిశుపాల్ అనే హిందువులు మరణించారు. రోహిత్ పండిట్, పవన్ కుమార్, సరోజ్ బాలా, రిథమ్ ధర్మ, పవన్ కుమార్ తీవ్రగా గాయపడ్డారు. ఇక… ఈ దాడులకు నిరసనగా హిందువులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాకిస్తాన్, ఇస్లామిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












