కొత్త ఏడాది పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. కొండపైన ఉన్న బస్ బే, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది.