న్యూజిలాండ్ వాసులు కొత్త సంవత్సరం 2023 లోకి అడుగు పెట్టేశారు. మన కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు న్యూజిలాండ్ కొత్త యేడాదికి ఘనంగా స్వాగతం పలికింది. గత యేడాది కరోనా కారణంగా ప్రజలు ఉత్సాహంగా జరుపుకోలేక పోయారు. ఈసారి అలాంటి ఆంక్షలు లేకపోవడతో న్యూ ఇయర్ ను ఘనంగా జరుపుకున్నారు. ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ వేడులను అద్భుతంగా జరుపుకున్నారు. ప్రజలు బాణా సంచాలు కాలుస్తూ.. కేక్ కోస్తూ.. పాటలు వింటూ అద్భుతంగా న్యూ ఇయర్ కి స్వాగతం పలికారు. మరో గంటలో సిడ్నీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోనున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోనున్నారు.