బిహార్ స్థానిక సంస్థల ఎన్నికలు రికార్డును నెలకొల్పాయి. 40 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిన చింతాదేవి … గయా డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు కూడా స్వీకరించారు. గయ మున్సిపాలిటీలో ఒకానొక సమయంలో పబ్లిక్ టాయిలెట్లు తక్కువగా వుండేవి. బహిరంగ మల విసర్జన కూడా అధికంగానే వుండేది. అలాంటి సమయంలో చింతాదేవి ఆ పరిసరాలను శుభ్రం చేశారు. మ్యాన్ హోల్స్ ను కూడా శుభ్రపరిచారు. అంతటి కింది స్థాయి నుంచి వచ్చిన చింతాదేవి… ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ప్రజలకు నిత్యం చేరువలో వుండటం వల్లే తనకు ఈ విజయం దక్కిందని చింతాదేవి చెప్పుకొచ్చారు. ఇదో చారిత్రక ఘట్టమని గయ నూతన మేయర్ గణేశ్ పాశ్వాన్ ప్రకటించారు.