నటి పూర్ణ ప్రమోషన్ కొట్టబోతోంది. తాను త్వరలోనే తల్లిని అవుతున్నానని ప్రటకించింది. కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వీడియోను పూర్ణ షేర్ చేసింది. దీంతో పూర్ణకు ఆమె భర్త, అభిమానులు, కుటుంబీకులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 12న దుబాయ్లో వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో పూర్ణ వివాహం జరిగింది. పెద్దలు నిశ్చయించిన వివాహం ఇరువైపు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంజరిగింది. సిల్వర్ స్ర్కీన్తోపాటు బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా పూర్ణ సందడి చేస్తున్నారు.













