ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ ప్రకటించింది. వచ్చే యేడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఉదయ 9:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ ల్యాంగ్వేజ్, ఏప్రిల్ 6 న సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8 న ఇంగ్లీష్, ఏప్రిల్ 10 న గణితం, ఏప్రిల్ 13 న సైన్స్, ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్, ఏప్రిల్ 17 న కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18 న ఒకేషనల్ కోర్సు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.