రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర మంత్రులు, అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల అనంతరం అర్చకులు ఆమెకు ప్రత్యేక ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదనంతరం ఆలయంలోని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉన్నారు. కాగా, యాదగిరిగుట్టను సందర్శించిన ఐదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.