”మా అమ్మ ఈశ్వర చరణాలకు చేరుకుంది”… మోదీ భావోద్వేగ ట్వీట్

”మా అమ్మ ఈశ్వర చరణాలకు చేరుకుంది” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. మా అమ్మలో త్రిమూర్తులను చూసుకున్నా. ఆమె జీవితం ఓ సన్యాసి జీవితంలాగే సాగింది. ఆమె జీవితమంతా ఓ తపస్సే. నిష్కామ కర్మయోగిలాగా జీవించారు. అత్యంత ఉత్తమ విలువలతో జీవనం సాగించారు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాల రీత్యా తల్లి హీరాబెన్ అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే వుందంటూ గురువారం సాయంత్రం వైద్యులు హెల్త్ బులిటిన్ కూడా విడుదల చేశారు. రెండు రోజుల క్రిందటే… ఆస్పత్రికి వచ్చి, తల్లిని చూసి మాట్లాడి వెళ్లారు. మరో రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని అందరూ భావించారు. అంతలోనే హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోదీని తీవ్ర విషాదంలో నింపేసింది.

Related Posts

Latest News Updates