ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాల రీత్యా తల్లి హీరాబెన్ అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే వుందంటూ గురువారం సాయంత్రం వైద్యులు హెల్త్ బులిటిన్ కూడా విడుదల చేశారు. రెండు రోజుల క్రిందటే… ఆస్పత్రికి వచ్చి, తల్లిని చూసి మాట్లాడి వెళ్లారు. మరో రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని అందరూ భావించారు. అంతలోనే హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోదీని తీవ్ర విషాదంలో నింపేసింది. అయితే… శుక్రవారం ఉదయం 4 గంటలకు కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. తల్లి మరణంపై నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరారని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. మా అమ్మ ఈశ్వరుడి పాదాల చెంతకి చేరింది. ఆమె జీవన యాత్ర ఓ తపస్సు. నిష్కామ కర్మ యోగి లాగా జీవించింది. అంటూ మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు.
మరో వైపు ప్రముఖులందరూ మోదీ తల్లి ఆకస్మిక మరణానికి సంతాపం ప్రకటించారు. మోదీకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు… అందరూ సంతాపం ప్రకటిస్తున్నారు. మరో వైపు తల్లి మరణ వార్త వినగానే ప్రధాని మోదీ అహ్మదాబాద్ కి బయల్దేరారు.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022












