హారర్ సినిమాలలో నటించడం కూడా ఇష్టమేనని నయనతార చాలా సార్లు చెప్పింది. అయితే.. అంతే స్థాయిలో హారర్ సినిమాలు చూస్తానని కూడా చెప్పింది. నయన్ తాజాగా నటించిన హారర్ మూవీ కనెక్ట్. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. అత్యంత షార్ట్ పీరియడ్ లో నయన్ మరో హారర్ మూవీ చేయడానికి సిద్ధపడిపోయింది. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్… త్వరలోనే నయన్ తో హారర్ మూవీ చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నాడట. కమల్ హసన్ తో కలిసి కనగరాజ్ దీనిని నిర్మిస్తున్నాడని ఓ టాక్. రత్నకుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడన్న టాక్ కూడా బలంగా వుంది. అయితే.. నయన్ హీరోయిన్ కాగా.. లారెన్స్ హీరో. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలో అనౌన్స్ చేయనున్నారు.