టెర్రర్ ఎకో సిస్టమ్ ను నిర్వీర్యం చేేసేయండి : అమిత్ షా

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న, వారికి సహాయం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఇక.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఎగదోస్తున్న ఎకోసిస్టమ్ ను నిర్వీర్యం చేసేయాలని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన బుధవారం జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమవేశంలో జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, ఎన్ఐఏ చీఫ్, రా చీఫ్, పారామిలటరీ బలగాల సీనియర్ అధికారులు, జమ్మూ కాశ్మీర్ పరిపాలన, పోలీసులు హాజరయ్యారు.

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించొద్దని, కఠినంగా వుండాలన్నారు. ఇక… జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా సమీక్షించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు వీలైనంత మందికి చేరేలా అధికారులు ప్లాన్ చేయాలని ఆదేశించారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై జమ్మూ కశ్మీర్ అధికారులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి వివరించారు.

Related Posts

Latest News Updates