తెలుగులో యాంకరింగ్ రంగాన్ని ఏలుతున్న సుమ ఇక యాకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తున్నారంటూ వార్తలు తెగ పుకార్ చేస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా… టాక్ షో అయినా… యాకరింగ్ అయినా… సుమనే గుర్తొస్తుంది. అంతలా అందరి నోళ్లల్లో నానింది. అయితే… ఇక యాంకరింగ్ కి దూరమవుతోందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.తాజాగా ఓ షో ప్రోమోలో ‘యాంకరింగ్ నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నా. ఇంతకాలం నన్ను ఆదరించినందుకు చాలా థాంక్స్’ అంటూ కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది. ఆ వీడియో వైరల్ అయ్యేసరికి సుమ నిజంగానే యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుందేమోనని అంతా అనుకున్నారు. దీనిపై సుమ క్లారిటీ ఇచ్చింది.
తాను రీసెంట్గా ఒక న్యూఇయర్ ఈవెంట్ కు యాంకరింగ్ చేశానని, అందులో కాస్త ఎమోషనల్ అయిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. కానీ, అది ఇండస్ట్రీని వీడుతున్నట్లు కాదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, ప్రోమో చూసి అంచనాకు రావద్దని కోరింది. ఆ ఈవెంట్ మొత్తం చూస్తే మీకు అసలు విషయం తెలుస్తుందని, తాను టీవీ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పుట్టానని చెప్పింది. ఇండస్ట్రీ విడిచి ఎక్కడికీ వెళ్లను. మీ వల్ల హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉండండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ విషెస్ చెప్పింది.