టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టబోయే పాదయాత్రకు పేరు ఖరారైంది. ”యువగళం” పేరుతో ఏపీలో నారా లోకేశ్ 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. పాదయాత్ర చేయాలని నెలన్నర క్రితమే డిసైడ్ అయినా…. పేరు ఖరారు కాలేదు. ఇప్పుడు యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్ర చేస్తారని టీడీపీ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. రూట్ మ్యాప్ మొత్తాన్ని కొన్ని రోజుల్లో పార్టీ ప్రకటించనుంది.












