హీరో నిఖిల్ నటించి కార్తికేయ2 చిత్రం భారీ హిట్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందులో నిఖిల్ నటించిన తీరు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అయితే.. కార్తికేయ3 పై నిఖిల్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. కార్తికేయ-3 కచ్చితంగా వుంటుందని వెల్లడించాడు. ఈసారి ప్రేక్షకులను అలరించడానికి 3డీలో వుంటుందని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన అభిమానులతో నిఖిల్ ట్విట్టర్ లో ముచ్చటిస్తూ ఈ విషయం ప్రకటించాడు. 18 పేజెస్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ సందర్బంగా ఆస్క్ నిఖిల్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో అభిమానులు అడిగిన వాటికి సమాధానాలు చెప్పాడు. 18 పేజెస్ సినిమాకి వస్తున్న ఆదరణతో ఎంతో సంతోషంగా వున్నానని అన్నాడు. కార్తికేయ సినిమా తన బాధ్యతను పెంచిందన్నాడు.












