కాపు రిజర్వేషన్ల అమలుపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరి రామ జోగయ్య ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. అగ్రవర్ణాల మాదిరిగా కాపులకు కూడా 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని, దీనిపై డిసెంబర్ 30 లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తాను చనిపోయినా సరే… కాపులకు రిజర్వేషన్లు సాధించి తీరుతానని ప్రకటించారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల విషయంలో సహకరించాలని కోరుతూ కాపు ప్రజా ప్రతినిధులకు లేఖలు రాశామని గుర్తు చేశారు. గతంలో అసెంబ్లీ చేసిన తీర్మానం ప్రకారం 10 శాతం అగ్రవర్ణాల రిజర్వేషన్ లో 5 శాతం కాపులకు కల్పించాలన్నారు. రిజర్వేషన్లు తమ హక్కు అని ప్రకటించారు.












