ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈనాటి విచారణకు తాను హాజరు కాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. తాను హైకోర్టులో పిటిషన్ వేశానని, ఆ పిటిషన్ బుధవారం బెంచ్ మీదకు వస్తుందన్నారు. అందుకే… నేటి ఈడీ విచారణకు వెళ్లాలా? వద్దా? అన్నది తమ న్యాయవాదులతో చర్చిస్తానని ప్రకటించారు. వారు ఎలా చెబితే.. అలాగే చేస్తానన్నారు. కోర్టులో పిటిషన్ ఉన్నందున తాను ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. హైకోర్టు విచారణ అనంతరం హాజరయ్యే విషయంపై తాను నిర్ణయం తీసుకుంటామని ఈడీ అధికారులకు పంపిన మెయిల్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.